మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావుల పెళ్లిరోజు సందర్భంగా 250 మందికి అన్నదానం

అమలాపురం, చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావుల పెళ్లిరోజు సందర్భంగా కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థులకు అలాగే అమలాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మరియు ఇతర సెంటర్లలో అనాధలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, మానసిక విద్యార్థులకు సుమారు 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.