రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు: సయ్యద్ నాగుర్ వలి

సత్తెనపల్లి నియోజకవర్గం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక. వ్యవసాయం అనే జీవన విధానంతో అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికి అన్నం పెడతాడు రైతన్న. ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టాలకు ఓర్చి పంట పండిస్తాడు. దేశాన్ని రక్షించే సైనికులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతే ఉంది. రైతులు దేశానికి చేస్తున్న సేవలను గుర్తుంచుకునేలా ఏటా డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం. తాను కష్టపడుతూ, నష్టపోయిన రైతు దేశానికి అన్నం పెట్టాలనుకునే అన్నదాతలు మన రైతన్నలు. తుఫానులకు, వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి వ్యవసాయం చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రభుత్వం ఆదుకున్నా, ఆదుకోకపోయినా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని వ్యవసాయం చేసే రైతు ధైర్యానికి మనం చేతులెత్తి జై కొట్టాలి. ప్రతి వస్తువు ధర ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తాడు. కానీ రైతు పండించిన పంట ధరను దళారులు, ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం. రైతులు కష్టాలు తీరాలన్న, రైతు తలెత్తుకొని ఆత్మగౌరవంగా జీవించాలన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతు కష్టాలకు చెల్లించిన పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితాన్ని 30 కోట్ల రూపాయలను 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన కౌలు రైతు భరోసా యాత్రతో రైతుల గుండెల్లో భరోసా నింపుతున్నారు, అలాంటి వ్యక్తికి అధికారం అప్పగిస్తే రైతులకు మరింత సహాయాన్ని అందిస్తారని పలువురు రైతులు అంటున్నారని నాగుర్ వలి అన్నారు.