రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా అన్నదానం

  • ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా అన్నదానం
  • అన్నదానం మహా ప్రసాదం.. తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 38వ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు, మరియు, వివిధ రకాల చికిత్స కోసం వచ్చిన పేషెంట్లకు బోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా తాలూకు అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్, సీనియర్ అభిమాని కరణం రవి లు మాట్లాడుతూ మెగా కుటుంబం ప్రజల కోసం అనేక రకాలుగా సేవలందిస్తు ప్రజల హృదయాల్లో నిలుస్తున్నారని కొనియాడారు. అలాంటి కుటుంబంలో మెగా వారసుడుగా వచ్చి గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఎదిగిన రామ్ చరణ్, ఎంతో మంది యువ అభిమానులకు ఆదర్శమని కొనియాడారు, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు పోతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ, రషీద్, వెంకటేష్, మారుతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.