ప్రజలకు సుపరిపాలన అందించడమే మా లక్ష్యం: స్రవంతి రెడ్డి

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కార్వేటినగరం మండల కేంద్రంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్. యుగంధర్ సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. స్రవంతి రెడ్డి, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇష్టాగోస్టిగా ప్రతి ఇంటిని సందర్శించి, భవిష్యత్తు గ్యారంటీలోని అంశాల్ని వివరించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనం కోసమే జనసేన పార్టీని స్థాపించారని, ప్రజల కోసమే పరితపించే గొప్ప నాయకులు, తాను సంపాదించినటువంటి డబ్బులో 48 కోట్ల రూపాయలు రుణ ప్రాయంగా నిరుపేదలకు పచ్చి పెట్టిన మహా నాయకులని కొనియాడారు. అందుకే ఇలాంటి స్వార్థం లేని నాయకులు, అధికారంలో లేక పోయినప్పటికీ స్వలాభా పెక్ష లేకుండా సహాయ కార్యక్రమాలు చేస్తుంటే, అధికారమిస్తే, అందలమెక్కిస్తే, ముఖ్యమంత్రిని చేస్తే రాయల పాలన తీసుకురావడమే కాకుండా, ప్రజలకు అద్భుతమైన సుపరిపాలన అందిస్తారని ఉద్ఘాటించారు. మా ధ్యేయం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడం, మా లక్ష్యం ప్రజలకు సుపరిపాలన అందించడమని తెలియజేసారు. కార్వేటి నగరాన్ని మహానగరం చేస్తామని, జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాగానే, ప్రతి వీధిని సుందరంగా తీర్చిదిద్దరమే లక్ష్యంగా పనిచేస్తామని, కార్వేటినగరం ప్రజల కోరికను నెరవేర్చి, అంగరంగ వైభవంగా కార్వేటి నగరాన్ని మారుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ స్థానికంగానే నివాసం ఉంటూ, స్థానిక ప్రజల మధ్యలో నివసిస్తూ, వాళ్ల సమస్యల్లో పాలుపంచుకుంటూ, సమస్య పరిష్కారమయ్యేంతవరకు వారి కోసం పోరాడుతూ , పవన్ కళ్యాణ్ అరుగు జాడల్లో నడుస్తూ, జీవిస్తున్నటువంటి వ్యక్తిని చూసి ఒకసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని కార్వేటినగరం మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల బూత్ కన్వినర్ మండి సురేష్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు సెల్వి, టౌన్ ఉపాధ్యక్షులు చంద్ర, మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, వెదురుకుప్పం యువజన అధ్యక్షులు సతీష్, కాపు యువసేన మండల అధ్యక్షులు మాదాసి వెంకటేష్, సీనియర్ నాయకులు రూపేష్, జనసైనికులు తులసి, రాజేష్ పాల్గొన్నారు.