గాంధీనగర్ ప్రాంతంలో మన ఊరు మన ఆట

కాకినాడ సిటీ: కనుమ పండుగ సందర్భంగా కాకినాడ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు 39వ వార్డు అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రాంతంలో మన ఊరు మన ఆట లో భాగంగా అంటూ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లో నిర్వహించిన ముగ్గులపోటీకి మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేయగా ఆ ప్రాంతమంతా శోభాయమానంగా కళకళలాడింది. ఈసందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వృత్తిరీత్యా, కుటుంబపరంగా, వ్యాపారరీత్యా వేరే వేరే పాంతాలలో జీవిస్తూ పండుగలకు కుటుంబసభ్యులతోను, బంధువులతో సంతోషాన్ని పంచుకోడమే మన సంస్కృతి చెప్పే వసుధైకకుటుంబం అన్న జీవిత సత్యమన్నారు. ఈభోగితో ఈ వై.సి.పి ప్రభుత్వ రాక్షసపాలనకి చరమగీతం ప్రారంభమైందనీ ఇంకొక 85 రోజులలో చీకటి అధ్యాయం ముగుస్తుందని వ్యక్తంచేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పిల్లలు, జనసేన వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.