కొవ్వూరుపాడులో మన ఊరు మన ఆట

గోపాలపురం: మంగళగిరి జనసేన పార్టీ జాతీయ కార్యాలయం ఆదేశాల మేరకు గోపాలపురం మండలం, కొవ్వూరుపాడులో మన ఊరు మన ఆట కార్యక్రమం కొవ్వూరుపాడు గ్రామం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రగడ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు హాజరయ్యి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం ముగ్గులు బాగా వేసిన వారిని ఫస్ట్, సెకండ్, థర్డ్ గా ఎంపిక చేసి బహుమతులు అందజేయడం జరిగింది. అలాగే ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వీరమహిళకి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, కొవ్వూరుపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రగడ రాంబాబు, ఊరి పెద్దలు చోరగుడి కేశవరావు, కొత్తపల్లి కృష్ణ, చిలక శ్రీను, బొమ్మ రామకృష్ణ, చిలక శ్రీను, అంకెం మంగరాజు, షేనం రాజేష్, కోలా రవికిరణ్, పసుపులేటి మణికంఠరాజు, షేక్ అహ్మద్, చింత సాయి, చిక్కారెడ్డి శ్రీను మరియు పెద్ద సంఖ్యలో జనసేన వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.