సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా రాజంపేట అసంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం (ఉమ్మడికడపజిల్లా) టి. సుండుపల్లి మండల పరిధిలో పెద్దబలిజపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగ సందర్భంగా కాట్టంరాజు గుడి వద్ద సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్ధలతో చిట్ల కుప్ప కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, పార్టీ శ్రేణులు, జనసైనికులు, బంధుమిత్రులు మరియు పాడిపశువులతో రైతులు, చుట్టుపక్కల గ్రామాల వారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వివిధ మాధ్యమాల సాంస్కృతి పద్ధతిలో డప్పువాయిద్యాలు, బాణసంచాలు, డేజెలతో యువకులందరూ అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా మండల, అసంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ, జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఆనందోత్సవాలతో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేసుకున్నారు.