పాడేరు జనసేన ఆత్మీయ సమావేశం

  • జనసేనాని పుట్టినరోజుని అందరూ విజయవంతం చేయాలని పిలుపు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ జిల్లా కార్యాలయంలో పాడేరు, అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య అధ్యక్షతనలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పార్టీ యొక్క సిద్ధాంతాలపై ఆదివాసీ ప్రజల్లో చైతన్యం కల్పించడం పార్టీ సంస్థాగతంగా నిర్మాణానికి జనసైనికుల తక్షణ కర్తవ్యం, నియోజకవర్గం వారిగా పలు మండల నాయకుల ముఖ్య కార్యాచరణ ప్రణాళికలు, ఐ.టి (సోషల్ మీడియా) సమన్వయం. రాబోవు సెప్టెమెబర్ 2 వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహణ ఇత్యాది విషాయాలను చర్చించుకోవడం జరిగింది. జనసైనికులు వీరమహిళలు, అభిమానులు జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్బంగా 2వ తేదీన అశేష సంఖ్యలో పాల్గొనాలని అలాగే ఆరోజు చేపట్టబోయే పలు సేవా కార్యక్రమాల్లో మీ వంతుగా జనసేనతో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, కొర్ర కమల్ హాసన్, సతక సత్యనారాయణ జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ప్రధాన కార్యదర్శి గొంది మురళి, సంతోష్, కిల్లో అశోక్ మస్తాన్, పవన్, సాలేబు అశోక్, రమేష్ నాయుడు, ఈశ్వర్ నాయుడు, వివిధ మండల స్థాయి నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.