అత్యాచారాలను అరికట్టేందుకు పాక్‌ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రపంచాన్నిఈ సమస్య పట్టిపీడిస్తోంది. మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడకూడదు అని ఎంతగా చెప్తున్నా కూడా కామంతో కళ్ళుమూసుకుపోయిన కొందరు కామాంధులు మహిళలపై అత్యాచారాలకి పాల్పడుతూనే ఉన్నారు. ప్రపంచంలో మహిళలపై జరిగే అత్యాచారాలని అరికట్టాలని ఉద్దేశంతో ఎన్నో దేశాలు కొత్త కొత్త చట్టాలు తీసుకువచ్చాయి తీసుకువస్తున్నాయి అయినా కామాంధులు వెనక్కి ఏ మాత్రం తగ్గడం లేదు. మన దేశంలో నిర్భయ చట్టం తీసుకొచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో అత్యాచారాలను అరికట్టేందుకు పాక్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారానికి తెగబడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా.. మార్చేందుకు వీలు కల్పించే నూతన చట్టానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దేశంలో ఎవరైనా మహిళలపై అత్యాచారానికి పాల్పడితే శాశ్వతంగా నపుంసకులుగా మార్చే చట్టాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం త్వరలో తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ చట్టం ఆ దేశంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.