పూతలపట్టులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం

పూతలపట్టు నియోజకవర్గం: వాలంటీర్ల ముసుగులో వైసిపి నాయకులు ఎక్కడయితే పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను పెట్టిన చోటే గురువారం పూతలపట్టు జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి, ఆ దుష్టశక్తుల వలన కలిగిన మైలును కడిగి వేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థను అధికార పార్టీ వాడుకొని వారి నుంచి సేకరించే సమాచారంతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటరీ ఉద్యోగం చేస్తున్న యువతలో చాలామంది ప్రతిభ కలిగిన వారు ఉన్నారని వారిని, ప్రభుత్వం సరిగా వినియోగించుకోకుండా వారి జీవితాల మీద దెబ్బ కొడుతుందని మాత్రమే పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలని వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు నిరసనలున్నారని మండి పడ్డారు. జనసేన ప్రభుత్వం రాగానే ప్రతిభ ఉన్న యువతకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అధికార పార్టీ చేసే ఆగడాలకు జనసైనికులు భయపడరు అని, నాయకుడు లాగే సైనికులు ఉన్నారని, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మండల అధ్యక్షులు పురుషోత్తం, మనోహర్ ఉపాధ్యక్షులు సానె నవీన్, ప్రధాన కార్యదర్శి తులసి బాబు, వాసు రాయల్, మౌని మండల యువత అధ్యక్షులు వినయ్, చందు మండల కార్యదర్శి మహాలక్ష్మి, తిరుమలేష్, వినోద్, బాను, పురుషోత్తం, కిరణ్ సీనియర్ నాయకులు సాన్ రమేష్, జ్ఞాన, ప్రవీణ్, విజయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.