ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఆ సమస్య పరిష్కరించడానికి జనసేన పార్టీ ఉంటుంది: మాడుగుల జనసేన

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలంలోని డి.గొట్టివాడ కి శంకరం పంచాయితీ కొత్తవలస గ్రామానికి మధ్య ఉన్నటువంటి ఉరకగెడ్డ బ్రిడ్జి కూలిపోయి కనీస రహదారి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు గాలిలో మాటలుగానే మిగిలాయి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న కొత్తవలస గ్రామా జనసైనికులు ఎలా అయినా అధికారం లేకపోయినా కనీసం నడుచుకుని వెళ్ళడానికి వీలుండేలా సొంత ఖర్చులతో మట్టిరోడ్డుకి పడిన పెద్ద పెద్ద గుంతలను గ్రావెల్ మరియు రాళ్లతో పూడ్చి నడవడానికి వీలుండేలా ఏర్పర్చుకోవాలని నిర్ణయించుకుని మండలంలో గల మిగతా జనసైనికులందరికి వారి కష్టాలను వారి గ్రామం యొక్క రోడ్డు సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాడుగుల మండల జనసైనికులందరు వెంటనే ఆ రోడ్డు మరమత్తులు చేయడానికి ఆ గ్రామ జనసైనికులకు మరియు ఆ గ్రామా ప్రజలకు భరోసా ఇఛ్చి దగ్గరుండి జనసైనికులందరు పెద్ద పెద్ద రాళ్లను సైతం లెక్కచేయకుండా దారి నిర్మాణానికి వారి వంతు కృషి చేశారు. అధికార పార్టీ అధికారం ఉండి కూడా ఏమిచేయకుండా చూస్తుంటే జనసేన పార్టీ మాత్రం వెనువెంటనే ఆ గ్రామ ప్రజలకు రాకపోకలకోసం దారిని ఏర్పాటు చేసారు ఇది చూసిన పలువురు గ్రామస్తులు మాడుగుల మండల జనసైనికులకు కృతజ్ఞతలు తెలియచేసి 2024లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా కృషి చేసి ముఖ్యమంత్రిగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి రాజు కొత్తవలస గ్రామ జనసైనికులతో పాటు మాడుగుల జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాబ్బా మహేష్, యన్నంశెట్టి సీతారాం, దయా యాదవ్, హరిబాల, ఇల్లపు రమేష్, బలరాం, కలిపిరెడ్డి రాజా, తలారి రమేష్, సుంకరి జగన్ తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గోన్నారు.