బ్రో విడుదల సంబరాలలో పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన బ్రో మూవీ విడుదల సందర్బంగా శుక్రవారం వెంకట్ గౌరి థియేటర్ లో ఉదయం 6 గంటలు షో సందర్బంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొనడం జరిగింది. పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలతో థియేటర్ దద్దరిల్లింది.