అగ్ని ప్రమాద భాదితులకు అండగా పాలకొండ జనసేన

పాలకొండ నియోజకవర్గం, గతవారం సీతంపేట మండలం మల్లమ్మ గూడలో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు కుటుంబాలకి ఆధారం లేకుండా పోయింది. ఆ కుటుంబీకులు, స్థానిక గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న జనసైనికులు విష్యాన్ని పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులకు చెప్పగా, వెంటనే ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి అయినా మేము సిద్ధం అని చెబుతూ.. బాదిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తూ జనసేన తరుపున ప్రతి కుటుంబానికి 2000/- నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు వస్తువులు, కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పండు ముసలవ్వకు ఇప్పటివరకు ఏ విధమైన పెన్షన్ అందివ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందని బాధను వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున బరోసా ఇవ్వడంతో పాటుగా, ప్రభుత్వ పరంగా రావలసిన ప్రతి ప్రతిఫలాన్ని అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అనుక్షణం మీ వెంట మేము ఉంటామని, మీకు ఒక తోడు ఒక నీడ దొరికే వరకు జనసేన పార్టీ మీకు అండగా దండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతంపేట జనసేన పార్టీ నాయకులు పాలకొండ నియోజకవర్గ జనసేన వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.