Mangalagiri: “పల్లెపల్లెకు జనసేన” కార్యక్రమం

జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా మంగళగిరి నియోజకవర్గంలో “పల్లెపల్లెకు జనసేన” కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులు కార్యకర్తలు నుంచి అభిప్రాయ సేకరణ మరియు గ్రామ, మండల కమిటీల నిర్మాణం పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు శెట్టి రామకృష్ణ, లింగనేని శ్రీనివాసరావు, వాసా శివనారాయణ, వాసా ఫణీంద్ర, గోపి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.