ఎగువశోభలో ఘనంగా పంద్రాగస్టు ఉత్సవాలు

ఎగువశోభ పంచాయతీలో సర్పంచ్ కొర్రా సింహాద్రి ఆధ్వర్యంలో ఆగస్టు 15, మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యఅతిధులుగా జనసేన మురళి, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శాంతిరావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన పంచాయతీ సచివాలయం సిబ్బందికి, నాయకులకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జనసేన మురళి మాట్లాడుతూ గిరిజన జాతి నుద్దేశించి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా సాధించుకున్న సరాజ్యం నేటికి ఆ స్వేచ్చా ఫలాలు ఆదివాసీ సమాజానికి అందని ద్రాక్షాలగా మిగిలిపోయింది. పంచాయతీ సభ్యులు దేశం నాకు ఏమిచ్చింది అనేదానికంటే నేను ఈ దేశానికి నా జాతికి ఏమివ్వాలి అని ఆలోచించగలగాలి స్వాతంత్ర్య వీరులను ఆదర్శవంతంగా తీసుకుని మీ పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా మీ నిబద్ధత, నిజాయితీ రాజకీయప్రక్షాళనకు గొప్ప ఆయువు పట్టుగా భావించి పనిచేయాలి. అలాగే మీరు చదువుకునే స్టూడెంట్ అయి ఉంటే ఆ రోజుల్లో మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ లాంటి వారు మీరు అవ్వాలి అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శాంత రావు మాట్లాడుతూ.. ఉత్కృష్టమైన దేశభక్తి నర నరాన జీర్ణించుకునే నవతరంతో సాగుతోంది. ప్రతి ఒక్క సభ్యులు దేశ అభ్యున్నతికి మీ వంతు కృషిగా పని చేయాలని అటువంటి భావజాలం ఉన్న పంచాయతీ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజాలవద్దకు తీసుకెళ్లే విదంగా ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పెద్దలు మాజీ సర్పంచ్ పాంగి మధు, అలాగే సచివాలయం సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ అగ్రికల్చర్ మేడం మహిళా పోలీస్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ మౌళి, పంచాయతీ వార్డు నెంబర్లు సుమిత్ర సుజాత, ఎగువశోభ వాలంటీర్ టీం సన్యాసిరావు, గణేష్, చిన్నారావు, జోగారావు, సత్తిబాబు, చిట్టిబాబు, శాంతి కుమారి, కమల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.