విద్యార్థుల మహాదర్నాకు మద్దతు తెలిపిన పంతం నానాజీ

విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకినాడలో విద్యార్థులు కదం తొక్కారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొని వారికీ సంపూర్ణ మద్దతు తెలిపారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలని, పిల్లల చదువును దూరం చేసే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూల్లోకి మ్యాపింగ్ చేయవద్దని, పాఠశాలల విలీనాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని, బైజుస్ ఒప్పందం రద్దు చేయాలని, దళిత, గిరిజన, బడుగుల పిల్లల చదువులకు దూరం చేసే విధానాలను వెనక్కి తీసుకోవాలని, విద్యా దీవెన, వసతి దీవెన అందరికీ సక్రమంగా అమలు చేయాలని కోరారు.. విద్యార్థుల యొక్క సమస్యలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు… ఈ కార్యక్రమంలో పోసిన రాము, దాసరి శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.