పాణ్యం మహిళా సమీక్షా సమావేశం

కర్నూలు నియోజకవర్గం, పాణ్యం, మహిళా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గం ఇంచార్జ్ చింత సురేష్ బాబు మరియు వీర మహిళా ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన విషయాలు మరియు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు మహిళలతో చర్చించడం జరిగింది. హసీనా బేగం మాట్లాడుతూ
జనసేనలో పనిచేస్తునందుకు ఒక మహిళగా గర్వంగా ఉంది. ప్రతీ పార్టీ మహిళా సాధికారత గురించి మాట్లాడి రాజకీయ లబ్ది పొందేందుకు ఏలా వాడుకుంటున్నారో ఈరోజుకీ మనం చూస్తూనే ఉన్నాం. పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూతురు పైన ఈడీ కేసు రాగానే మహిళలకు 33% రిజర్వేషన్ గుర్తొచ్చింది. వెంటనే దీక్షకు దిగింది. ఢిల్లీలో కేవలం ఒకే ఒక్క మహిళామంత్రిని వాళ్ల మంత్రి మండలిలో ఎదో దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలా పెట్టుకొని అలానే నిన్న, మొన్న చూశాం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన మాటలు ఎలా వాళ్ళు రాజకీయాల కోసం స్క్రిప్ట్ ఇచ్చి మహిళా నాయకుల చేత తిట్టిస్తారో ఆవిడ స్పష్టంగా చెప్పారు. రోజా అయితే మనకి లైవ్ లోనే దొరికి పోయింది. ఇలా రాజకీయ పార్టీలు మహిళలతో చీప్ పాలిటిక్స్ చేయిస్తున్నాయి కానీ జనసేన పార్టీ 2019 ఎలక్షన్స్ మానిఫెస్టోలోనే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చేర్చింది అందుకు తగినట్టుగానే ముందు నుంచీ కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఇవాళ మనం ఇక్కడ ఉండగలగడం ఇతర పార్టీలలో రాజకీయ నేపథ్యం కల్గిన, బాగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించిన మహిళలను కూడా వారి వారి పార్టీలలోకి తీసుకొని పేరుకు మాత్రం పదవి వాళ్ళకి ఇచ్చి అధికారం వేరే వాళ్ళు చెలాయించడం చూస్తున్నాం. కానీ, పవన్ కళ్యాణ్ సమాజంలో మహిళలు ముందుకు రాణించాలని ఉద్దేశంతో వీర మహిళా విభాగం అని జనసేన పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నేడు సమాజంలో తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లి మనల్ని మనకు ఉన్న సామాజిక స్పృహ గుర్తించి మనకు పార్టీ లో నీ అన్ని విభాగాలలో ప్రాధాన్యం ఉన్న స్థానంలో పెట్టడమే కాదు మనకు ఏటువంటి ఆటంకాలు లేకుండా ప్రజ్యస్వామ్యయుతంగా మన గొంతుని వినిపించే స్వెచ్చనిచి మహిళలకు నాంది పలికారు. అటువంటి వారిని నాయకులను 2024లో ముఖ్యమంత్రి చేసే దిశగా అడుగులు వేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డ్ వీర మహిళ నరసమ్మ, ప్రసన్న, సుమలత, మాధవి, మరియు వీర మహిళలు పాల్గొన్నారు.