అండగా నిలిచిన జనసైనికులు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపిన పసుపులేటి హరిప్రసాద్

జనసేన నేతల అరెస్టులకు అండగా నిలిచిన 14 నియోజకవర్గాల ప్రతినిధులు
తేనె తుట్టెను కదిపారు… తమ ఉద్యమ తాకిడి, హోరు చూస్తారు…
అంతం కాదిది ఆరంభం…జనసేన హెచ్చరిక…

చిత్తూరు జిల్లా, టీటీడీ అవుట్సోర్సింగ్ కార్మికుల, న్యాయమైన కోరికల సాధనకై, పరిపాలనా భవనం ముందు దీక్ష చేపడితే నేటి పాలక ప్రభుత్వం టిటిడి యాజమాన్యంతో కలిసి అతి కిరాతకంగా, రాక్షస దాడితో ఉదయం అరెస్టు చేసి, తిరుపతి సమీప ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు తరలించి భయాందోళనలకు గురి చేయడం దారుణమని, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో విడుదలైన సందర్భంగా చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ప్రతినిధుల సమక్షంలో పసుపులేటి మాట్లాడుతూ… నేటి వైసిపి పాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అనకొండ వలె వ్యవహరిస్తున్నారని, చలిచీమల చేత చిక్కి చచ్చిన పాములా…. కార్మికుల ఉగ్రరూప ఆగ్రహానికి, బలికాక తప్పదని హెచ్చరించారు…. జనసేన, వామపక్ష పార్టీల నాయకులు విడుదల సందర్భంగా అండగా నిలిచిన జనసైనికులు, నాయకులు అందరికీ పసుపులేటి హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.