ఆలమూరు మండల మొదటి సమావేశంలో పలు ప్రజా సమస్యలపై దుమ్ము దులిపేసిన జనసేన పార్టీ పినపళ్ల సర్పంచ్ సంగీత శుభాష్!

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండల పరిషత్ మొట్టమొదటి సమావేశం శుక్రవారం చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఆలమూరు వైయస్సార్ పార్టీ మండల పరిషత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే ప్రముఖ నాయకులు చిర్ల జగ్గిరెడ్డి ఈ సమావేశమునకు బిజీ షెడ్యూల్ మూలంగా మండల పరిషత్తు సభకు అందుబాటులో లేకపోయినా, కొత్తగా ఎన్నికైన ఎంపిటిసిలు, సర్పంచ్లు, ఆలమూరు మండల జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి, ఆలమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి, ఆలమూరు మండల వ్యవసాయ రైతు కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, ఆలమూరు మండల పరిషత్ అధికారిని ఝాన్సీ, మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి లక్ష్మీపతి, మండల హౌసింగ్ అధికారీ జేజిబాబు, మండల ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మరియు ఆలమూరు మండల పోలీస్ అధికారి ఎస్.శివ ప్రసాద్,ఇతర ఉన్నతాధికారులు, పలు శాఖలకు చెందిన వారు, పలువురు గ్రామాల సెక్రటరీలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ సమావేశమునకు అంతా పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని పలు అంశాల మీద, ఎంతో అనుభవంతో పినపల్ల జనసేన పార్టీ సర్పంచ్ సంగీత సుభాష్, సభలో మాట్లాడిన తీరు ఎంతోమందిని ఆకట్టుకున్నదని, అలాగే మండల ప్రతిపక్ష నాయకులు తమ్మన భాస్కర రావు వారికి సహకారంగా ఎంతో తోడ్పాటు ఇచ్చారని, వీరితో పాటు పలువురు అధికార పార్టీ, ప్రతిపక్ష ఎంపిటిసిలు, సర్పంచ్లు, అందరూ, అధికారులతో చాలా ఐకమత్యంతో పలు ప్రజాసమస్యల మీద మాట్లాడి సభను జయప్రదం చేసి ఉన్నారు. ముఖ్యంగా సభలో పలు అంశాలపై చర్చ జరిగినది. ప్రభుత్వ ఇళ్లకు రిజిస్ట్రేషన్ పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి మాత్రమే అధికారులు ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని, గతంలో అధికారం రాకముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా ఇల్లుకు ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ప్రభుత్వాసుపత్రుల్లో మంచివైద్యం, అన్నిస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని, మండలంలోని అన్ని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీల శుభ్రత, ఆలమూరు మండలంలో ప్రధాన రహదారి, మరియు పలు గ్రామాల్లో ప్రధాన రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలని, మండలంలో విద్యుత్ సమస్యలు లేకుండాచేయాలని, అలాగే ఇల్లు నిర్మాణం చేసుకొనే వారికి ఇల్లుకు లోన్ మంజూరు చేయాలని, ఇసుక ర్యాంపుల్లో ప్రభుత్వ ధరలకే ఇసుకను అందించాలని, ముఖ్యంగా పంచాయతీల్లో నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్న సర్పంచులకు వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిధులను, వెనక్కు విడుదల చేసి, నిధులు మంజూరు చేయాలని తెలియజేశారు. అంతేకాకుండా కరోనా టైంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ఏఎన్ఎమ్ జిఎన్ఎమ్, స్టాఫ్ నర్సులు, ఆశ వర్కర్లు చేసిన సేవలు, మేలు మర్చిపోలేనిదని, అదేవిధంగా పత్రిక, వీడియో జర్నలిస్టులపాత్ర చాలా ముఖ్యమైనదని, జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, ఆలమూరు మండలం ప్రతిపక్ష నాయకులు తమ్మన భాస్కర్ రావు ఆనందం వ్యక్తం చేస్తూ తెలియజేశారు.