విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన పాటంశెట్టి

జగ్గంపేట నియోజకవర్గం: గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామంలో నిస్వార్థ జనసైనికుడు గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్ జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. గత నెల రోజులుగా 35 జట్ల మధ్య జరుగతున్న ఈ టోర్నమెంట్ లో విన్నర్ గా నీలాద్రిరావుపేట జట్టు, రన్నర్ గా ఏలేశ్వరం జట్టు నిలిచి బహుమతులు అందుకున్నారు. విన్నర్ గా నిలిచిన నీలాద్రిరావుపేట క్రికెట్ టీమ్ కు సూర్యచంద్ర చేతులు మీదుగా విన్నర్ కప్ మరియు ఇరవై వేల రూపాయల పారితోషికం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఒక నిస్వార్థ జనసైనికుడు విజయ్ మనందరి మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం కానీ, విజయ్ గుర్తుగా నీలాద్రిరావుపేట యువత మరియు గ్రామ పెద్దలు అంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వలన విజయ్ ని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం మొదలైన ఈ విజయ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్విరామంగా కొనసాగించడానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.