పంటపాలెం పంచాయతీలో ఆయిల్ కంపెనీల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల సమస్యలు పట్టవా

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పంటపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న టువంటి 300 కుటుంబాలు ఈ గిరిజన కుటుంబాలకు గతంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయిల్ కంపెనీ యాజమాన్యం ప్రతి ఒక్క కుటుంబానికి ప్యాకేజ్ అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కంపెనీలు మాత్రం సజావుగా కొనసాగుతున్నాయి ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి దుర్వాసన పొల్యూషన్ ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు పీల్చుకొని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన ఎన్నికల సమయాలలో వాళ్ళ ఓట్లు కోసం మీకు రావాల్సిన అమౌంట్ ఇప్పిస్తామని చెప్పడం ఎన్నికల అయిపోయిన తర్వాత ఆ సమస్యనీ గాలికి వదిలేయడం జరుగుతుంది దయచేసి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు రెండుసార్లు మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. దయచేసి ఏదైతే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వుట్ల బలిజ పాలెంలో నివసిస్తున్న రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలకి కంపెనీలు ఇస్తానన ప్యాకేజీ డబ్బులు వాళ్ళకి త్వరితగతిన బాధ్యతగా ఇప్పించాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలా జరగని పక్షంలో వాళ్లకు అండగా ఉండి కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రవికుమార్, సందీప్, శ్రీను, శ్రీహరి, గిరీష్, వంశీ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.