చేజర్ల గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట

సత్తెనపల్లి నియోజకవర్గం:  నకరికల్లు మండలం, చేజర్ల గ్రామంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ చేజర్ల గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ వారి ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ను ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ఇంటింటికి చేరువ చేసే విధంగా కరపత్రాలను ప్రతి ఇంటికి అందించిన అప్పారావు గారు జనసేన మేనిఫెస్టో గురించి తెలియజేశారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను నియోజకవర్గంలోని మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలను గుర్తు చేశారు. నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామంలో ఉన్న ఈ చేజర్ల గ్రామానికి కనీస సదుపాయాలు లేవని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వైయస్సార్సీపి ప్రభుత్వ అరాచకాలను అరికట్టాలని వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలంటే 2024లో గాజు గ్లాసుపై ఓటు వేసి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని తెలియ చేశారు.. ఈ కార్యక్రమానికి జిల్లా చేజర్ల గ్రామ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ ఉపాధ్యక్షులు లింగిశెట్టి రామారావు, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి చాపల కళ్యాణ్, కృష్ణం శెట్టి చౌడయ్య, మురళి, కాసా వెంకట్రావు, గుండ్లపల్లి వీరేంద్ర, రుద్రు రంగారావు, నార్ల రాంబాబు, పసుపులేటి శ్రీను, కాసా వీరబ్రహ్మం, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్,సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, మైనారిటీ నాయకులు జాన్ పీరా, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగినది.