పావలా లీడర్ జగన్ మోహన్ రెడ్డి గారే: రైల్వే కోడూరు జనసేన

రైల్వే కోడూరు నియోజకవర్గం: వైసిపి ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు వ్యాఖ్యలను రైల్వేకోడూరు జనసేన వేదికగా జనసేన నాయకులు ఖండించడం జరిగింది. కొరమట్ల శ్రీనివాసులు కోడూరులో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ను పావలా కళ్యాణ్, అజ్ఞాన కళ్యాణ్ అని.. చంద్రబాబు గారి తొత్తు అని విమర్శించడం జరిగింది. ఈ రెండు విషయాలపై రైల్వే కోడూరు జనసేన వేదికగా జనసేన నాయకులు కొరముట్ల ను ప్రశ్నిస్తూ.. మీ గ్రామం బ్రిడ్జి పూర్తి చేసి మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే గారికి సలహా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక పావలా వంతు కూడా అభివృద్ధి చేయకుండా.. మెహర్బానీ మాటలు మాట్లాడుతున్న నాయకుడు మీ జగన్ రెడ్డి గారేనని గుర్తు చేస్తున్నాం. అందుకే జనసేన తరఫున పావలా జగన్ మోహన్ రెడ్డి గారు అని నామకరణం చేస్తున్నాం. మీ నాయకుడి బిరుదుని ఎదుటివారి కి ఆపదించి మాట్లాడటం మీ మూర్ఖత్వమే అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి మీద అవినీతి చక్రవర్తి అని బుక్కు ప్రింట్ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతిని నిరూపించుకోలేక జగన్ రెడ్డి గారు చంద్రబాబుతో తమ దొంగ చాటు స్నేహాన్ని జనసేన తరపున గుర్తు చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కోడూరులో ఎగిరేది జనసేన పార్టీ ఎమ్మెల్యే జెండా అని ఘంటా పదంగా చెప్తున్నాం. నాలుగు సార్లు కోడూరు ఎమ్మెల్యేగా గెలిచిన కోరమట్ల శ్రీనివాసులు గారు కోడూరు అభివృద్ధికి చేసిన ప్రయత్నం శూన్యం అని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాజంపేట ను జిల్లా హెడ్ కోటర్ గా చేసుకొనే పోరాటంలో కొరముట్ల శ్రీనివాసులు గారు నిర్వీర్యం చేసిన ఘనత దక్కించుకున్నారని ఈ సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వాస్తవాలను గుర్తించి పవన్ కళ్యాణ్ గారి మీద అకారణంగా నిందలు వేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ముత్యాల కిషోర్, మర్రి రెడ్డి ప్రసాద్, ఉత్తరాది శివకుమార్, యద్దల అనంతరాయులు, లింగాల హరి, జనసేన దళిత నాయకులు నగిరిపాటి మహేష్, సిరియాల శివకుమార్ పాల్గొన్నారు.