శ్రీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లె, శుక్రవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు వాల్మీకి బోయ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నివాళులర్పించి శుభాకాంక్షలు లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన జాతి బోయ జాతి. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వాల్మీకి బోయలకు ఈనాడు వాల్మీకి జాతికి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీరని అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఓటింగ్ మిషన్ లాగా వాల్మీకులను వాడుకుంటున్నారే గాని, వాల్మీకులకు న్యాయం చేద్దాం అనే ఆలోచన లేదు. భారత దేశంలో ఇతర రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బిసి-ఎ గా కొనసాగుతున్నాం, పక్కనే ఉన్న కర్ణాటకలో విచారించుకోండి నిజానిజాలు తెలుస్తాయి. ఎంతోమంది నాయకులు ఎస్టి జాబితా కోసం పోరాటాలు చేస్తుంటే అసెంబ్లీలో తీర్మానం అంటారు పార్లమెంట్ కి పంపామని చెబుతారు. మళ్ళీ దాని గురించి మాట్లాడరు, వాల్మీకులను రాజకీయం పరంగా, విద్యాపరంగా, ఎదగనివ్వకుండా అడ్డుకోవడానికి అగ్ర కుల నాయకులు చేస్తున్న కుట్రగా భావించవచ్చు? ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరు చెప్పి బోయలను కోస్తాంధ్ర బోయలను ఎస్టిలో, రాయలసీమ బోయలను భ్ఛ్లలో ఉంచి విడకొట్టడం ఎంతవరకు సమంజసం. రాయలసీమలో అత్యధిక సంఖ్యా బలం ఉన్న వాల్మీకులను బిసిలుగా మార్చి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి హక్కులను హరించి వేస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెనుకబాటు తనానానికి కారణం అవుతున్నారు. రాయలసీమ వాల్మీకులకు రిజర్వేషన్ దక్కాలి అంటే ఎస్టి పునరుద్దరణ జరిగి తీరాల్సిందే. దీనికి ప్రతీ వాల్మీకి బిడ్డా దీనికి బాధ్యత వహించి పోరాటానికి ముందుకు రావాలి. రిజర్వేషన్ లేకుంటే పెరుగుతున్న పోటీ ప్రపంచంలో నువ్వు రేపు లక్షలు కోట్లు పెట్టి చదివించినా నీ బిడ్డలు ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్యారంగంలో సీట్లు గాని, ఉద్యోగం గాని, రాజకీయ రంగాలలో అవకాశాలు గానీ రావు. ఒక్క మార్పుతో మహర్షులు కాకపోయినా మనుషులు అవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, తులసి శ్రీనివాసులు, అశ్వత్, జనసేన నాయకులు పాల్గున, సుప్రీం హర్ష, ధరణి, సోను, రామిశెట్టి నాగరాజు, అనిల్, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.