వడ్డీపాలెం ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, యండమూరు గ్రామంలోని వడ్డీపాలెం ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణ లో భాగంగా జనసేన నాయకులు గంజా దుర్గా ప్రసాద్, కుక్కల మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, స్థానిక ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న తెలుగుదేశం నాయకులు. పంతం నానాజీకి స్థానిక ప్రజలు
వారి సమస్యలను విన్నవించారు. వడ్డీపాలెంలో సరైన రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని
వడ్డీపాలెం నుండీ వేళంగికి వెళ్లే ఏటిగట్టు రోడ్డుకి శంకుస్థాపన చేసి వదిలి పెట్టేసారు. ఎన్ని సార్లు చెప్పిన స్థానిక వైసీపీ ఎం ఎల్ ఏ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వాకాడ గ్రామానికి మల్లించి ఇక్కడ పనులు నిలిపివేసిన వైసీపీ ంళా.
స్థానికులకు ఉపాధి లేక దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం తో గ్రామం అంత కాలిగా ఉంది. ఆరోగ్య శ్రీ కార్డులు పనిచేయక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, మంచి నీరు ట్యాంక్ శుభ్రం చేయడం లేదు అని ఇలా అనేక సమస్యలు తెలిపారు. త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన వడ్డీపాలెం యువత మరియు టీడీపీ నాయకులు పిల్లి శ్రీను, పిల్లి రమేష్, గుబ్బల అప్పారావు, మేడిశెట్టి భద్రరావు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.