రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై గళమెత్తిన రాయపూడి

  • జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు

అవనిగడ్డ నియోజకవర్గం: చిన్నపాటి వర్షపు నీటికి అవనిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రోడ్లు మునిగిపోవటం దారుణమని జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు. గురువారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవటం, ఈ సమస్యపై ఎన్ని గ్రామసభల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం డ్రైన్ సిస్టంని సరిచేయక కనీసం మురికినీరుపారుదల కోసం ఎల్లవేయలేని పరిస్థితిలో నేడు మేజర్ పంచాయతీ అని చెప్పుకునే గ్రామపంచాయతీ ఉంది. జనవరి గ్రామసభలో చెప్పాం, మార్చి గ్రామ సభలో చెప్పాము. మే నెల మొదటి వారంలోని డ్రైన్ అన్ని ఎల్ల వేయించుతాం అని చెప్పారు. మీరు జూలైలో మొదలు పెట్టినపుడు వర్షాలుపడ్డాయి. మీరు డ్రైన్స్ వెళ్లవేయించేటప్పుడు ఫోటోలు తీసుకున్నారు. వాటిని పూర్తి చేసామని బిల్లులు చేసుకోండి. కేవలం ఈ ఒక్క చోటే కాదు పురాతన కాలనీగా చెప్పబడే స్థానిక రెండో వార్డ్లో ఉన్నఎస్టి కాలనీ వాసులు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బుధవారం పడ్డ ఈ వర్షానికి ఆ రోడ్లు మునిగిపోయి ప్రజలు రాక పోకలకు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవనిగడ్డ లోని స్టేట్ బ్యాంక్ రోడ్డు చూస్తే నిత్యం ప్రజలు ప్రయాణం చేసే రోడ్డు, ఈ రోడ్డులో బ్యాంకు ఉంది, ఎస్.వి.ఎల్ కాలేజ్ ఉంది, అంగన్వాడీ కేద్రం ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రవేట్ స్కూల్ ఉంది, ఎల్.ఐ.సి, బి.ఎస్.ఎన్.ఎల్, హెడ్ పోస్ట్ ఆఫీస్ లు ఉన్నాయి. అవనిగడ్డ నుండి నిత్యం వందలాదిమంది విద్యార్థులు వస్తున్నారు. ఈ రోడ్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 15 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడి పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి ఎందుకు అంటే చుట్టూ నీరు, పిచ్చి మొక్కలు అలాంటి పరిస్థితిలో పాములు ఉంటాయి పిల్లలకు జరగరాని సంఘటన జరిగితే బాధ్యలు ఎవరిది?. ఎందుకు ఇంత నిరలక్ష్యం చేస్తున్నారు. రోడ్డులు ప్రక్కన పిచ్చి చెట్లు అడవిలాగా పెరిగిపోయినాయి. ఎందుకు పట్టించుకోవటం లేదు. ఒక మేజర్ గ్రామపంచాయతీ, నియోజకవర్గం హెడక్వార్టర్ పరిస్థితి ఇలా ఎందుకు చేస్తున్నారు. పాలకులు ఎందుకు పట్టించుకోవటం లేదు?. ఇప్పటికయినా ఎమ్మెల్యే గారు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు, అధికారులు పట్టించుకొని, ఈ రోడ్డులో ఉన్న మురుగు నీరు బయటకు పంపించి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అన్నీ వార్డులో బ్లీచింగ్, దోమలు మందు కొట్టించి ప్రజలు ఆరోగ్యం కాపాడాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు పాల్గొన్నారు.