పవన్ కళ్యాన్ ఆరోగ్య సేవా సమితి సహకారంతో 5 నెలల చిన్నారికి ఉచిత ఓపెన్ హార్ట్ సర్జరీ

*2.5 లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ లో అడగగా ?.. ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించిన పవన్ కళ్యాన్ ఆరోగ్యసేవా సమితి పెద్దలు మరియు సోల్జర్స్

*హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో 5 నెలల బాబు కి ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించిన పవన్ కళ్యాన్ ఆరోగ్యసేవాసమితి తెలంగాణరాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధానకార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్

*945 వ ఓపెన్ హార్ట్ సర్జరీ పవన్ కళ్యాన్ ఆరోగ్యసేవాసమితి ప్రాజెక్ట్

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆర్.సి తాండ గ్రామానికి చెందిన సుజాతరాజు 5 నెలల బాబు కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని హైదరాబాద్లో ఉండే నిలోఫర్ హాస్పిటల్ లో డాక్టర్స్ చెప్పగా.. ఇక్కడ చేయలేమని బయట ప్రైవేట్ హాస్పిటల్ లో చేయించుకోమని చెప్పగా.. బాబు తల్లిదండ్రులు బంజారాహిల్స్ లో ఉండే ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ లో చిన్నపిల్లల గుండెవైద్యనిపుణులు కి చూపించగా.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవా పదకము క్రింద చేస్తాము అని దానితో పాటు 2.5 లక్షలు రూపాయలు మీరు చూసుకోవాలని.. లేకుంటే ఈ ఆపరేషన్ చేయలేమని వైద్యులు చెప్పగా.. అంతడబ్బులు మాదగ్గరలేవని మేము పేదవాళ్ళము అని తెలుపగా.. మేము చేయలేమనివైద్యులు తెలిపారు. ఏమీ చేయలేని స్థితిలో తిరిగి ఇంటికి వెళ్ళాక.. తెలంగాణ రాష్ట్రం పవన్ కళ్యాన్ ఆరోగ్య సేవాసమితి సోషియల్ మీడియా ఇంచార్జ్ తన వీడియోస్ ద్వారా బయట ప్రపంచానికి నిజా.. నిజాలు తెలియపరుస్తూ పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ కి తన వంతు పని చేస్తూ ఉండే వ్యక్తి అతను సామాజిక బాధ్యత కలిగిన పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ బాధ్యత కలిగిన పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ వారి పవన్ కళ్యాన్ సోల్జర్..

పవన్ కళ్యాన్ ఆరోగ్యసేవాసమితి అనే పేరు మీద ప్రజల అందరి డబ్బులే ప్రభుత్వ వైద్యసేవ పథకాలు అని.. అందరికీ ఆరోగ్యం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని వివరిస్తూ ఉచిత ఆపరేషన్స్ చేపిస్తున్నారు. అనే విషయం తన విడియో రూపంలో బయట ప్రపంచానికి తెలిసి అది నాగర్ కర్నూల్ జిల్లా పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ కి తెలిసి స్థానిక సుజాతరాజు 5 నెలల బాబు విషయం తెలుసుకున్న అతను పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ కీ కాల్ చేయడంతో స్పందించిన వాళ్ళు నాగర్ కర్నూల్ జిల్లా పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి వంగ వంగ లక్ష్మణ్ గౌడ్ తో మాట్లాడి విషయం చెప్పడంతో దాదాపు 25 రోజులు ఫాలప్ చేసి పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ తో ప్రతి నిత్యం వంగ లక్ష్మణ్ గౌడ్ పేషంట్ యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ అపోలో హాస్పిటల్ లో పేషంట్ యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ అపోలో హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆర్.సి తాండ గ్రామం కి చెందినసుజాత, రాజుల 5 నెలల బాబు కి పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడం జరిగింది.

అపార అనుభవం కలిగిన చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ స్వైన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి విజయవంతం చేయడం జరిగినది.

డాక్టర్ సునీల్ స్వైన్ కి వంగలక్ష్మణ్ గౌడ్ మనస్పూర్తిగా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసినారు.

ముఖ పరిచయం లేకుండా ఆపరేషన్ చేపించినందుకు పేషంట్ మరియు కుటుంబీకులు వంగ లక్ష్మణ్ గౌడ్కు వెనక నుంచి “సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ వారికి పవన్కళ్యాణ్ గారి సోల్జర్స్ కి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

అలాగే పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ కి పేషంట్ విషయంలో బ్యాక్ సపోర్ట్ గా నిలిచిన పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ తెలంగాణరాష్ట్రం మరియు ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇంఛార్జ్ రామ్ తాళ్లూరి అలాగే పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ గౌరవ సలహాదారులు జయకళ్యాణి కి పేషంట్ మరియు కుటుంబీకులు హృదయపూర్వకధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేశారు.

పేషంట్ తరపున పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ తరపున హాండ్స్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసారు..

పేషంట్ విషయంలో సహాయ సహకారాలు అందించిన అపోలో హాస్పిటల్ పి.ఆర్.ఓ సరోజినీకి పవన్ కళ్యాణ్ గారి సోల్జర్స్ తరపున మనసు పూర్తిగా హృదయ పూర్వకధన్యవాదములు తెలియజేసారు..

పేషంట్ తరపున పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ తరపున డాక్టర్ సునీల్ స్వైన్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే సతీష్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసారు.

తెలంగాణ జీ.వీ ఆరోగ్య మిత్ర సతీష్ మరియు అపోలో హాస్పిటల్ ప్రొఫెసర్ సరోజిని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో సామాజిక బాధ్యత కలిగిన పవన్ కళ్యాన్ మెడికల్ ప్రాజెక్ట్ వారి పవన్ కళ్యాణ్ సోల్జర్స్ పాల్గొన్నారు.