పవన్ కళ్యాణ్ కటౌట్ మరియు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిఅమరావతిని అభివృద్ధి చేయాలని, నిర్ణయిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ మొదటి నుంచి అమరావతి రైతుల పక్షాన నిలబడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కటౌట్ కు మరియు పోలీస్ స్టేషన్ సెంటర్లో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… నిన్న హైకోర్టు వెలువరించిన తీర్పు అమరావతి రైతులకు ఏ కాక 5 కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, 807 రోజులు అమరావతి రైతులు కృషి పట్టుదలకు ఫలితమే యొక్క తీర్పు అని అన్నారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అమరావతి రాజధానికి కట్టుబడి ప్రజలపక్షాన నిలబడ్డారని, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే పంతాన్ని విడిచి మూడు రాజధానులు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి అమరావతి అభివృద్ధికి పాటుపడాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు, ఇన్నిరోజులు కృషి పట్టుదలతో నిరసన దీక్షలు చేపట్టిన అమరావతి రైతులకు, వారికి వెన్నుదన్నుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, పెడ కొలిమి కిరణ్ కుమార్, భయ్యా వరపు రమేష్, షేక్ మదీనా, తుమ్మల పూడి వెంకటకృష్ణ, చిదేళ్ల రామకృష్ణ, గద్దెనబోయిన సతీష్, అబ్దుల్ గఫూర్, కార్తీక్, వంశీ, నన్నేసా, సైదా వలి, నాగూర్, జకరయ్య నాగేంద్రబాబు, బాబు, శేషయ్య, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.