3 వేల కుటుంబాలకు పెద్ద కొడుకులా నిలబడిన పవన్ కళ్యాణ్

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదివారం మదర్స్ డే సందర్భంగా తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వీర మహిళలతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక అఘాయిత్యాలు మహిళలపై జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, మహిళలకు పెద్ద పీట వేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రతి తల్లికీ కడుపు కోత మిగులుస్తున్నారు. ఈ మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే యాగీ చేస్తున్నామని, అఘాయిత్యానికి గురి అవుతున్న మహిళల తల్లుల కడుపు కోతని యాగీగా హేళన చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడడంపై నిరసిస్తూ మీడియా సమావేశం అనంతరం జగన్ రెడ్డి దిష్టి బొమ్మకు చీర, గాజులు తొడిగి నిరసన తెలియజేసే క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అసమర్థ ముఖ్యమంత్రి, చేత కాని ముఖ్యమంత్రికి ప్రతి మహిళా తగిన బుద్ది చెబుతారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఈ పోలీసులు బలవంతపు అరెస్టు చెయ్యడం హేయమైన చర్య. నిజమైన మహిళా పక్షపాతి పవన్ కళ్యాణ్, చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తూ 3 వేల కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా నిలబడ్డాడు అని తెలిపారు. ఈ రాష్ట్ర మహిళలు జగన్ రెడ్డికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.