టీం పిడికిలి రూపొందించిన గోడప్రతులు ఆవిష్కరించిన అనంతపురం జనసేన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ పంట నష్టపోయి, అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనపార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ తెలియజేశారు. ఎన్నారై జనసైనికుడు మైలవరపు రాజా ఆద్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో ఆటోలకు పోస్టర్లను అతికించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చెసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే రెండు జిల్లాలోని కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని మే 8 ఆదివారం రోజు కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఓదార్యాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి చేస్తున్న సేవలు వెళకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు ఎర్రి స్వామి, కుందుర్పి మండల అధ్యక్షుడు జైయ కృష్ణ, వీర మహిళ షేక్ తార, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన నాయకులు జాకీర్, అనిల్, లక్ష్మణ్, శివ, మధు, ఇంద్ర, హర్ష, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.