ప్రజాసమస్యలు పరిష్కరించటంలో వైసీపీ విఫలం

  • గుడ్లురు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం

గుడ్లురు: జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కందుకూరు ఇంచార్జ్ పులి మల్లికార్జున ఆదేశాల మేరకు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన గుడ్లురు గ్రామంలో శివాలయం సంఘంలో పర్యటించటం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంఘం వాసులకు పార్టీ సిద్దాంతాలను తమ నాయకుడు చేస్తున్న కార్యక్రమాలు వివరించి. వారికి ప్రభుత్వ పదకాలు అందుతున్నాయా అని జనసైనికులు అడుగగా వారు రేషన్ ఆధార్ కార్డుల అవక తవక వలన ఫించన్లను ఇతర పదకాలను పొందలేక పోతున్నాయని, అదే విదాంగా ఎన్నికలకు వచ్చి ఓట్లు వేయించుకున్న నాయకులు సంఘంలో ఒక వీది లైట్లు, పారుశుద్ద్య పనులు చేపట్టక పావడంతో రాత్రి పూట రోడ్లు పై చికటిలో, దోమలతో కుట్టించు కొంటూ జీవిస్తున్నామని. గ్రామానికి కిలోమీ దూరంలో ఉన్న ఈ సంఘాన్ని నాయకులు, అధికారులు పట్టించుకోక పోవటం భాదాకరం అని జనసైనికులు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అని తిరుగుతున్న నాయకులు, అధికారాలు మీరు సంక్షేమ పదకాలు అందిస్తున్నామని చెప్పటం తప్పచేసిందేమిలేదని అన్నింగి చలపతి అన్నారు. తమకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, మీ సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తామని హామీ ఇచ్చి ప్రమాదంలో కాలు పోగొట్టుకొని ప్రభుత్వ పదకాలు అందుక కుటుంబాన్ని పోషించు కోలేని ఏడు కొండలు కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులను జనసైనికుల ఆర్థిక సహాకారంతో అందచేసారు. గ్రామంలో ఎం ఐ ఆర్ శివాలయం సంఘాలలో నివాసం ఉంటున్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని జనసైనికులు కోరారు. ఈ కార్యక్రమంలో చలపతి, మూలగిరి శ్రీని వాసులు, మాధవ, ఆమోస్, అహరోన్‌, రత్తయ్య, ఆళ్ల శివ, ప్రతాప్, సాగర్, జనసైనికులు పాల్గొన్నారు.