పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చెయ్యాలి

గాజువాక నియోజకవర్గ ఇంఛార్జ్, పిఏసి సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చేయ్యాలి. ఇది గాజువాకలో ఉన్న జనసేన నాయకుల వారందరికి అభిప్రాయం. గాజువాకలో అనేక సమస్యల తిష్టవేసి ఉన్నాయి. దశాబ్దాల కాలంగా అవన్ని పెండింగులోనే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్ కు ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ ఆపి ప్రభుత్వం రంగంలో ఉండేటట్లు, ప్లాంట్ నిర్మాణం కొరకు భూమిలిచ్చిన నిర్వసితులకు ఉపాధి కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగల శక్తి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే గాజువాకలో ప్రారిశ్రామిక అభివృద్ధి కోసం ఆటోనగర్ ఏపీఐఐసి, ఫార్మా సిటీ, గంగవరం పోర్టు ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగల శక్తి, సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధి కల్పించగల సత్తా పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం అని తెలిపారు. ఉపాధి లేక వలసలు పోతున్న ప్రజలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఐయ్యిందని దుయ్యబట్టారు. రాయితీలు ఇచ్చి ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని, కొత్త పరిశ్రమలు తెచ్చి ప్రజలకు ఉపాధి కల్పించాలని. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొండలు పుట్టలు మీద నివసించే వారికి పూర్తి స్థాయి మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నందున. గతంలో ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అనివార్య కారణాల వల్ల ఓడిపోయారని ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని, ఈసారి నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామని గాజువాక ప్రజలు చేబుతున్నారని తెలియజేశారు. భవిష్యత్తు అవసరాలు తెలిసిన మనిషి పవన్ కళ్యాణ్ ని, చిత్తశుద్ధి తో ప్రజలకు సేవ చేస్తారని, కనుక పవన్ కళ్యాణ్ ని అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అందరి అభిలాష అదేవిధంగా. గాజువాక ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గాజువాకే కాదు ఉత్తరాంధ్ర అభివృద్దికి ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ సర్వే కూడా చేయించుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై ప్రజలు సుముఖంగా ఉన్నారు. గాజువాకలో నియోజికవర్గ స్థాయి నుంచి డివిజన్ బూతు స్థాయి కమిటీల వరకు పార్టీ నిర్మాణం జరిగిందని, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గాజువాకలో 3200 భూత్ కమిటీ సభ్యులు, సుమారు 8000 వేల మంది క్రియాశీలక సభ్యులు ప్రజల మద్య ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, గవర సోమశేఖర్, లంకల మురళి దేవి, మాక షాలిని, కరణం కనకారావు, ముసలయ్య, కాద శ్రీను, గొలగాని గోపీచంద్, చిన అప్పారావు, కళావతి, కనకరాజు, రౌతు గోవిందరావు, దాసరి జ్యోతి రెడ్డి, కొల్లి శివాజీ, బలిరెడ్డి నాగేశ్వరావు, దుల్ల రామునాయుడు, భార్గవ్, చైతన్య కృష్ణ, సాడె రామారావు, ముమ్మన మురళి, చందక చిన్నారావు, లంక లతా, పత్తి రామలక్ష్మి, ఇందిర ప్రియదర్శిని పాల్గొన్నారు.