పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, మునమర్రు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసేనపార్టీ మండల అధ్యక్షులు కంబాల బాబులు అధ్యక్షతన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఐదు కోట్లు రూపాయలు సొంత నిధులు ఇచ్చినందుకుగాను పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశచరిత్రలోనే ఎప్పుడు లేనివిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ నాయుకుదైనా మేము అధికారంలోకి వస్తే ఆది చేస్తాం, ఇది చేస్తాం అని కళ్ళబోల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తూ కాలం గడిపేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఆయన ఆశయాలకు నిలబడి ప్రతీ పేదవాడికి అండగా ఉండాలనే ఆశయంతో రాష్ట్రం ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల ప్రతీ కుటుంబానికి, వారి బిడ్డల భవిష్యత్ కోసం లక్ష రూపాయలు అందించడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లి వారి కుటుంబ సభ్యులును పరామర్శించి వారికి నేనున్నాను అనే భరోసా కల్పించుటకోసం రైతు భరోసా యాత్ర ప్రారంభించారాని, ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఆయన కష్టార్జీతం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్నందుకు ఒక జనసైనికునిగా ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. అందుకోసమే గురువారం మునమర్రు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయుకులు, మండల నాయుకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.