విజ్ఞాన్ యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

పొన్నూరు నియోజకవర్గం: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గర యూనివర్సిటీ జనసైనికులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వేడుకలకు ముందుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, మహిళా రీజనల్ కోర్దినేటర్ బోని పార్వతి నాయుడు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దేశం శెట్టి సూర్య, మేకల రామయ్య యాదవ్, యన్నం నాయుడు, తదితరులకు జనసేన పార్టీ యూనివర్సిటీ విద్యార్థి నాయకులైన జక్కా గిరీష్, యర్రంశెట్టి ప్రశాంత్, శంకర్, మరియు విజ్ఞాన్ పవర్ బాయిస్ తదితరులు భారీ బైక్ ర్యాలీ తోటి ఘనస్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సుమారుగా 52 కేజీల భారీ బర్త్ డే కేక్ ను జనసేన నేతలు కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూత్ జిందాబాద్ లతో, కేరింతలతోటి ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసైనికులను, విద్యార్థి నాయకులను వారు అభినందించినారు.