ఎటపాక మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • బాసవగు గ్రామంలో పార్టీలో భారీ చేరికలు

రంపచోడవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎటపాక మండలం, బాసవగు గ్రామంలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ ఆధ్వర్యంలో సుమారుగా 20 కుటుంబాలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగినది. తర్వాత కేక్ కట్ చేయడం, స్కూల్ పిల్లలకు బుక్స్ పంచడం జరిగినది. లక్ష్మీపురం గ్రామంలో కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకు నోటు బుక్స్ పంచడం జరిగినది. అదేవిధంగా నెల్లిపాక గ్రామంలో కేక్ కట్ చేయడం నాయకులు పార్టీనీ ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. తర్వాత ఎటపాక మండలం శ్రీరాంనగర్ కాలనీలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు భారీ సంఖ్యలో జనసైనికులు పాల్గొని బైక్ ర్యాలీ చేయడం జరిగినది. అనంతరం చింతలగూడెం, చితంపేట కన్నాయిగూడెంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొనీ భారీ ఎత్తున బైక్ కి ర్యాలీ చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. రాయనపేట, తోటపల్లి, చోడవరం, మురుమూరు, నందిగామ, గౌరీపేట, గన్నవరం, గుండాల, ఏటపక, గుండి వరిగుడెం, చితంపేట సితపురం, అవేర్ కాలనీ గ్రామాలలో కూడా భారీ ఎత్తున జనసైనికులు పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.