పుంగనూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పుంగనూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జిల్లా కార్యదర్శి పగడాల రమణ సహాయ సహకారాలతో టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, రూరల్ ప్రసిడెంట్ విరూపాక్ష, జిల్లా పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్ వీరి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా వృద్ద ఆశ్రమం నందు అన్నదానం, కేక్ కటింగ్, భవన నిర్మాణ కార్మికులు అన్నదానం మరియు భీమగనిపల్లి బైపాస్ శ్రీ కృష్ణ దేవరాయలు సర్కిల్ నందు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని శ్రీ సుగుటురు గంగమ్మ తల్లి ఆశిసులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సహాయ సహకారాలతో 2024లో ముఖ్యమంత్రి హోదాలో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అలాగే ఆంధ్ర ప్రదేశ్ దిశ దశ మార్చాలని శ్రీ వేంకటేశ్వర స్వామినీ కోరుకుంటున్నామ జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విరూపాక్ష, నరేష్ రాయల్, చైతన్య రాయల్, హరీ నాయక్, చంద్ర, నాగార్జున, నాగభూషణం, మనోజ్, రమేష్, జ్ఞాన, మని, జగదీష్, రెడ్డి, మహేష్, బాలాజీ నాయక్, మోహన్, అశోక్, హరీ ప్రసాద్ తదితురులు పాల్గొన్నారు.