సూర్యాపేట జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర పర్యవేక్షణ సభ్యుడు సతీష్ రెడ్డి సూచనల మేరకు శనివారన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో జిల్లా నాయకుడు రామగిరి శివ సాయి ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అపూర్వ బంధువుల పాఠశాలలో వారి చేత కేక్ కట్ చేసి వారికి పండ్లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల్ నాగార్జున, మొదల శంకర్ యాదవ్, గుడిసె గౌతమ్, శంకర్ నాయక్, ఆకాష్, లింగ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.