రాజానగరంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఏలూరు ‘వారాహి’ విజయయాత్ర బహిరంగసభలో అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలు, అరాచక పాలన సాగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో అవలంబిస్తున్న తీరును, అలానే వాలంటీర్ల సేకరించిన డేటాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించిన మాటలను వైసీపీ శ్రేణులు పూర్తిగా వక్రీకరించి, పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అనేక తీవ్రమైన అంశాలను పక్కకు పెట్టి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాలంటీర్లు రెచ్చగొట్టి తీవ్ర ప్రజావ్యతిరేకతతో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రపూరితంగా పలుచోట్ల పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగలబెట్టి, అర్థం పర్థం లేని నిరసన కార్యక్రమాలతో వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ శ్రేణులు శునకానందం పొందుతున్నారని, వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒక్కసారి శ్రద్ధగా పూర్తిగా వినాలని, వాలంటీర్ల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని, ప్రజలందరూ ఈ కుతంత్రాలను గమనిస్తూ ఈసారి ఏకపక్షంగా జనసేన పార్టీ వైపు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు పూర్తిగా పవన్ కళ్యాణ్ కే ఉంటాయని ఈ సందర్భంగా చెప్పారు. ఎలాంటి కుట్రలు, అవమానాలు ఎన్ని ఎదురైనా ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ దీటుగా తట్టుకుని ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతారని సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ రాజానగరం మండలం, కానవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, ఇతర నేతలు, జనసైనికులు వీరమహిళలు క్షీరాభిషేకం చేశారు. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తూర్పుగోనగూడెం సర్పంచ్ గల్లా రంగా, సీనియర్ నేత కొత్తపల్లి రఘు, పాలచర్ల రాజారావు, కురుమళ్ళ మహేష్, కొత్తపల్లి బుజ్జి, అడబాల అదివిష్ణు కానవరం సీనియర్ & యువ జనసేన నేతలు, జనసైనికులు కానవరం జనసేన యూత్ ఈ సందర్భంగా వైసిపి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించి, వాలంటీర్లను రెచ్చగొట్టి వాళ్ళ చేత అసత్య ఆరోపణలు చేయిస్తున్న వైసీపీ నేతల చేస్తున్న దుష్ప్రచారాన్ని జనశ్రేణులు దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కానవరం జనసేన యువనేతలు, కానవరం గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.