5వ విడత పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా

  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 47వ రోజు

తెలంగాణా, నాగర్ కర్నూల్ నియోజకవర్గం: నాగర్ కర్నూల్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, జనసేన పార్టీ బలోపేతం చేస్తూ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా.. వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర కార్యక్రమం 46 రోజుల పాటూ, 4 విడతలుగా తెల్కపల్లి, బిజినపల్లి, తిమ్మజిపెట్, తాడుర్ మండలాల్లో కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ విడత నాగర్ కర్నూల్ మండలంలో శుక్రవారం నుండీ ప్రారంభమైనది. పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా47వ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం, మల్కాపురం గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రగా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయాలకు పెద్ద భవనాలుగా నిర్మించుకోవడానికి అధికార పార్టీ నాయకులకు సమయం ఉంది కానీ, నియోజకవర్గంలోని పేద వాడి కల ఇల్లు డబల్ బెడ్ రూం ఇళ్ళ సమస్య నెరవేర్చుటకు సమయం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు బి.అర్.ఎస్ నాయకులకు మాత్రమే, కానీ ప్రజలకు ఏమి లేదు. మన నాగర్ కర్నూల్ బిజినెస్ మాన్, నల్లమట్టితో కడిగిన ముత్యం గారికి బిజినెస్ తప్ప మరో ఆలోచన ఉండదు. ఎప్పుడు ఒకటే ఆలోచన ప్రజల సొమ్ము ఏవిధంగా దోచుకోవాలి, తిరిగి ఆ డబ్బు ఎన్నికల సమయంలో ఓటుకు ఎంత ఇచ్చి గెలవాలి అని ఆలోచన మన బిజినెస్ మాన్ గారిది. నియోజకవర్గ అభివృద్ధి అంటే ప్రభుతంలో ఉన్న పార్టీ నాయకులు అభివృద్ధి చెందినట్టు కాదు. బి.అర్.ఎస్ నాయకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి ముఖ్యంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ అధికార పార్టీ నాయకుల అక్రమాలకు, ప్రజలు ఖచ్ఛితంగా తగిన బుద్ధి చెప్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పెద్ద కొడుకునని చెప్పి, ఈ రోజు మనకు, మన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేశారు. కావున ఈ అరాచక పాలన మారాలంటే మన ఓటు మనమేసుకోవాలి. గాజు గ్లాసు గుర్తుకు ఓటెద్ధాం.. మన భవిష్యత్తును కాపాడుకుందాం.. అని లక్ష్మణ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి, సూర్య, వంశీ రెడ్డి, పూస శివ, లింగం నాయక్, మహేష్, సందీప్, సి.ఎం మహేష్, లాలూ ప్రసాద్, ఆనంద్, సి.శివ, ఎమ్.శివ, హేమంత్ కుమార్, శివ, పవన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.