పవన్ సేవా వారోత్సవాలు – మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం

అమలాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అమలాపురం జనసేన పార్టీ నాయకులు డీయంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో “పవన్ సేవా వారోత్సవాలు” నిర్వహించనున్నారు. ఈనెల 30వ తేదీన మొదలై సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో మొదటి రోజున సర్వమత ప్రార్దనలు, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 మరియు 2 తేదీల్లో భారీగా 18 విభాగాల డాక్టర్లతో మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత క్యాన్సర్ టెస్టులు రాజమండ్రి జి.యస్.యల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహించనున్నారు. 3వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 4న అనాధ ఆశ్రమాల్లో అన్నదానం, చివరగా 5వ తేదీన సేవామూర్తులకు సన్మాన కార్యక్రమం జరపనున్నట్లు జనసేన నాయకులు డి.యం.ఆర్.శేఖర్ తెలిపారు. ఈ యొక్క సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని మీడియా ద్వారా తెలియచేశారు. దీనికి వాయిస్ మరియు నల్లా ఇంద్రాణి మెమోరియల్ సేవా సంస్థలు నిర్వహణా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, ఇసుకపట్ల రఘుబాబు, కంచిపల్లి అబ్బులు, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, ఆకుల సూర్యనారాయణ మూర్తి, నాగమానస, బట్టు పండు, పడాల నానాజీ, పోలిశెట్టి చిన్ని, వాకపల్లి వెంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, జి.లక్ష్మి, నల్లా వెంకటేశ్వరరావు, పాలూరి నారాయణ స్వామి, నిమ్మకాయల రాజేష్, సాయి, అల్లాడ రవి, గట్టెం వీరు, నల్లా మూర్తి మరియు నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.