చీరాలలో జనసేన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

  • జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగం కమిటీ నియామకం
  • పవన్ కళ్యాణ్ దృష్టికి “పవనన్న చేనేత బాట”

చీరాల నియోజవర్గం: దేశాయిపేట పంచాయతీ నూలుమిల్లు సెంటర్ వద్ద జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. అనంతరం కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. కార్యాలయం ప్రారంభోత్సనికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ముందుగా చీరాల నియోజవర్గం, పందిళ్ళపల్లి హైవే జంక్షన్ వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతో వేటపాలెం మీదుగా దేశాయిపేట కార్యాలయంకు చేరుకొని పార్టీ కార్యాలయంను ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ నాయకులతో గ్రామస్థులతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగం కమిటీని ప్రకటించి, నియామక పత్రాలు అందించడం జరిగింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగం కమిటీ సభ్యులు:
అధ్యక్షులు: కర్ణ కిరణ్ తేజ, ఉపాధ్యక్షులు: పింజల సంతోష్ కుమార్, బూడిద వరహాల రావు
ప్రధాన కార్యదర్శులు: డోగుపర్తి లలిత్ కుమార్, గోలి సురేష్, గుత్తి సదాశివరావు
కార్యదర్శులు: తాటిపర్తి మోహన్ కుమార్, చింత జయకుమార్
సంయుక్త కార్యదర్శులు: పృద్వి శ్రీహరి బాబు, బట్టు బాలాజీ, వుట్ల జయశంకర్, పింజల దేవీ వరప్రసాద్, మారేళ్ళ హరికృష్ణ బాబు, తాడికొండ శ్రీహరి, మునగాల శ్రీనివాసరావులను నియమించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఇంత కసిగా ఉందా అనిపించే విధిగా దాదాపు 12 కిలోమీటర్లు క్రమశిక్షణతో బైక్ ర్యాలీ చక్కగా నిర్వహించారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అలాగే దాదాపు 25 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున చీరాల అంటేనే చేనేతకు ప్రసిద్ధి. చీరాల నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి లేకపోయినా చేనేత యువత బయటకొచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ దాదాపు సంవత్సరం నుంచి “పవనన్న చేనేత బాట” కార్యక్రమంతో ప్రతి చేనేత గడపకు వెళ్లి వారి సమస్యలు సేకరించి చేనేత సమస్యలు పుస్తకమును రూపొందించి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి ఇచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన యువత అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున రాష్ట్రంలో చూస్తుంటే వైసీపీ పాలన చాలా దారుణంగా ఉంది. మళ్ళ మేమే అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. ఉచితంగా దొరికే ఇసుకను కూడా ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ వైసిపి ప్రభుత్వం వారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమస్యల మీద ప్రశ్నిస్తుంటే, ఈ వైసీపీ ప్రభుత్వం వారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల పైన దూషిస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కి ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా ఇప్పుడు ప్రజలకు మనమేమి చేయగలమని కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తూ, జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా క్రియాశీలక సభ్యత్వం, ఇన్సూరెన్స్ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి. రాబోయే ఎలక్షన్లలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు, మంగళగిరి నుంచి చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు (జె.ఎస్.ఆర్), ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటిఎంసీ కార్యదర్శి షేక్ వజీర్, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.