నేతాజీ కి నివాళులర్పించిన తంబళ్ళపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ రైతుపేటలోని జనసేన పార్టీ కార్యలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ 23 జనవరి 1897లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జన్మించారు. భారత స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింస వాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి, వాటిలో ఒకటి ” మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను “అనే నినాదంతో తమతో పాటు చేరమని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇలాగే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు జనసేన నాయకులు కలిసి ఇప్పుడున్న ఈ దుష్ట ప్రభుత్వ పరిపాలనను గద్దె దింపి జనసేన, టిడిపి ని అధికారం లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 2022లో నేతాజీ పుస్తక ఆవిష్కరణ సభలో మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతాజీ గురించి మాట్లాడుతూ ఆయన యొక్క అస్థికలను ఇండియాకు తెప్పించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.