పవనన్న పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు

  • ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
  • పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న జన సైనికులు
  • వృద్దాశ్రమంలో అన్నదానం చేసిన జనసేన ఐనవోలు మండల నాయకులు

వర్దన్నపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వర్దన్నపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐనవోలు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు బర్ల శివ ఆధ్వర్యంలో మండలం లోని పున్నెలు గ్రామం దగ్గర ఉన్న కనకదుర్గ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోవర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు రఘుమోహన్, రాజు, సంతోష్, రాజ్ కుమార్, సమాద్ కుమార్, శ్రీకాంత్, సాయినాథ్, అజిత్, హరి తదితరులు పాల్గొన్నారు.