మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన

  • జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు
  • మంగళగిరిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం మరియు క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి పట్టణంలోని 6వ వార్డు ఇందిరానగర్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఇందిరానగర్ లో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఆత్మీయ సమావేశంలో పార్టీకి ఆకర్షితులై చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో పలువురు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. పార్టీలో చేరిన వారు: బండారు సోము, ఇంధనం బుజ్జి, బండారు రమాజనేయులు, ముగుళ్ళ సతీష్ కుమార్, తమాడ శివ, పట్టెం రామాంజనేయులు, జింక అనిల్ కుమార్, కర్రి దినేష్ కుమార్, అరబోలు దుర్గ జ్ప్రసాద్, వానపల్లి వంశీ కృష్ణ, మొరభోయిన రామకృష్ణ, కొండేటి సురేష్, గోలి ప్రకాష్ కుమార్, గిడుతురి దుర్గాప్రసాద్, వద్ది ఆది విష్ణు, మల్లురి శ్రీనివాసరావు, మాల్లురి రాజేశ్వరి, కొండేటి దుర్గాప్రసాద్, మెలేటి నాగదుర్గ భవానీ, గిడుతురీ వీరబాబు తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇంతటి మంచి ఆత్మీయ సమావేశం నిర్వహించిన పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అదేవిధంగా పార్టీలో చేరతామని మహిళలు మరియు యువకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చూస్తుంటే రెండుసార్లు మంగళగిరి శాసనసభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రజలు గెలిపించుకుంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా జెసిబిలు వెంటేసుకుని అడ్డొచ్చిన ఇళ్లను కూల్చుకుంటూ, రోడ్డుల మరమ్మత్తులు అంటూ ఫోటోలు దిగుతూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రోడ్ల వెంట తిరుగుతున్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సమస్యని కుడా పరిష్కరించలేకపోయారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని మనందరం కలిసికట్టుగా ఉండి జనసేన పార్టీని గెలిపించుకుందామని మంగళగిరి గడ్డ జనసేన అడ్డాల మారే విధంగా చేద్దామని అన్నారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టాలంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందామని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యే విధంగా, అలాగే నియోజవర్గంలో పార్టీ గెలుపు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మారుతీరావు, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు(జె.ఎస్.ఆర్), ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, ఎంటిఎంసీ కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరరావు, షేక్ వజీర్ భాష, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, ఇందిరా నగర్ జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *