పలు కుటుంబాలను పరామర్శించిన పేడాడ

పొందూరు మండలం, కేసుదాస్ పురం గ్రామంలో జనసైనికుడు శ్రీరామ్ బాబాయ్ బొచ్చ అప్పలసూరి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆముదలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ వారి కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెబుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరియు గోరంటి గ్రామంలో జనసైనికుడు శివ అమ్మమ్మ పేడాడ అన్నపూర్ణమ్మ అకాల మరణంతో స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబానికి పేడాడ రామ్మోహన్ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన రావు, పొందూరు మండల అధ్యక్షులు ఎలకల రమణ, సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, నియోజకవర్గ నాయకులు కొంచాడ సూర్య, తవిటి నాయుడు, ఫణి కుమార్, సాగర్ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.