సోంపేట తహశీల్దార్ కు జనసేన వినతి

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, మహారాజశ్రీ సోంపేట తహశీల్దార్ రమేష్ దివ్యసముఖమునకు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంనకు చెందిన నిరుపేద జగనన్న కాలనీ లబ్ధిదారులు మరియు ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్చార్ దాసరి రాజు నమస్కరించి వ్రాయు విన్నపములు. విషయం: బారువ పేట సముద్రం ఒడ్డున ఇసుక దిబ్బలపై పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీ స్థలాలు నివాస యోగ్యం కానందున వేరే చోట మార్చుట గూర్చి.
అయ్యా!
మేము అనగా జగనన్న కాలనీ లబ్దిదారులం మిమ్ములను అర్ధించినది ఏమనగా, మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి సంవత్సరం పైనే అయింది శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, బారువ గ్రామంను ప్రభుత్వం వారు రెండు క్లస్టర్లుగా విభజించి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. బారువ-1 కు చెందిన లబ్ధిదారులకు పెద్దమ్మ కోవెల పక్కన, బారువ-2 కు చెందిన లబ్ధిదారులకు బీచ్లో ఇసుక దిబ్బలు వద్ద కేటాయించారు. బారువ బీచ్లో ఇసుక దెబ్బలు పై ఇచ్చిన స్థలాలు ఏమాత్రం నివసయోగ్యం కాదు. ఎందుకనగా..
1.బారువ సముద్ర తీరం తలచూ తుఫాన్లు వచ్చే ప్రాంతం. ఇప్పటికే ఫైలిన్, హుదూద్, తిత్లి తుఫాన్లను చవిచూసాము.

  1. బీచ్లో ఇసుక దిబ్బలు నిరంతరం కోతకు గురి అవుతున్నాయి. ఆ దిబ్బల మీదే జగనన్న ఇళ్ల స్థలాల కేటాయించారు.
  2. సెంట్రల్ గవర్నమెంట్ సి.ఆర్.జడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి 500 మీటర్ల తర్వాత శాశ్వత నివాస స్థలాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు 500 మీటర్ల లోపే ఉన్నాయి.
  3. పేదలైన మేము ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇసుక దిబ్బలపై వ్యయ ప్రయాసలతో నిర్మాణాలు చేసుకోలేము. ఒక్క పునాది వేయడానికే సుమారు 3 నుంచి 4 లక్షలు అవుతుందని అంచనా.
  4. బారువఇసుక దిబ్బలపై ప్రభుత్వం వారు ఎన్ని కోట్లు వెచ్చించినా, సముద్రం తీరం పక్కనే కాబట్టి ఒక్క తుఫానుతో నేలమట్టమగును. ప్రభుత్వం వ్యయం కూడా వృధా అగును.
    కాబట్టి పేదలైన మేము నివసయోగ్యం కానీ ఇసుక దిబ్బలపై ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వ్యయ ప్రయాసలతో ఇల్లు నిర్మాణం చేసుకోలేము. నివాసయోగ్యమైన వేరేచోట ఇళ్ల స్థలాలు కేటాయించి పేదలకు న్యాయం చేస్తారని మిమ్మల్ని ఈ వినతిపత్రము మూలంగా వేడుకొంటున్నాము. ఈ కార్యక్రమంలో బైపల్లి ఈశ్వరరావు జాయింట్ సెక్రెటరి మరియు జనసేన ఇచ్చాపురం నాయకులు భాస్కర్, దుంగ భాస్కర్, డొక్కర ఈశ్వర్, శైలజా, రవి, దున్న శ్రీను తదతరులు పాల్గొన్నారు.