అరెస్టు చేసిన నాయకులను బే షరతుగా విడుదల చేయాలని పీలేరు జనసేన డిమాండ్

పీలేరు, జనసేన నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న జనసేన నాయకులు, అక్రమ అరెస్టు చేసిన నాయకులను వెంటనే బే షరతుగా విడుదల చేయాలని చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షుడు దూది జస్వంత్, ఎర్ర వారి పాలెం మండలం అధ్యక్షుడు ముండ్లపాటి మురళి మరియు మండల కమిటీ సభ్యులు తీవ్రంగా డిమాండ్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో జనవానణి కార్యక్రమంలో భాగంగా ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన సందోహం చూసి వైయస్సార్ పార్టీ నాయకులు ఉలిక్కిపడి జీర్ణించుకోలేక అక్రమ అక్రమ కేసులు బనాయించి జనసేన నాయకులను మరియు జనసైనికులను అరెస్టు చేయడం జరిగినది. ఈరోజు అధికారం మీకు ఉందని విర్రవీగుతున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేపు మేము అధికారంలో వస్తాం కానీ మీలాగా పైశాచికంగా మేము ప్రవర్తించదల్చుకోలేదు మీరు కొత్త కొత్త డ్రామాలు కోడి కత్తి డ్రామాలు మాదిరిగా మరో డ్రామాకు తెర లేపారు త్వరలో ప్రజలే మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీగాల అరుణ, నాజీర్, చింతకాయల కృష్ణయ్య, రాంబాబు, బొమ్మల కిషోర్ రాయల్. వెంకట్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.