అరెస్టు చేసిన మా నాయకులను వెంటనే భేషరతుగా విడుదలచేయాలి: పులి మల్లికార్జునరావు

  • జనసేన అంటే వైసీపీ నాయకులకు ఎందుకు అంత భయం ?
  • సమస్యలు వెలికితీస్తే మీ లొసుగులు బయటపడతాయని భయమా?

కందుకూరు, ఈనెల 16వ తేదీ జరగనున్న జనవాని కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రాకను వైసిపి నాయకులు జీర్ణించుకోలేకపోవడం మరి దారుణమైన పరిస్థితిగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనం సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నోవాటెల్ హోటల్ వరకు భారీ పోలీసులు మోహరించి, అడుగడుగునా అడ్డంకులు ఏర్పాటు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పత్రికా ముఖంగా వైసిపి నాయకులకు తెలియజేయడమేమనగా ఆంధ్రప్రదేశ్ ఎవడి అబ్బ జాగీరు కాదు, దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమస్యను ప్రశ్నించే హక్కు ఉంది కానీ ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం ఒక రాజకీయ నాయకులకు కొమ్ముకాసే విధంగా పోలీసులు ప్రవర్తించడం ఈ రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద దౌర్భాగ్యమైన ప్రభుత్వంగా వైసీపీని చెప్పుకోవచ్చు. అలాగే వైజాగ్ లో ఉండే మంత్రులకు గాని వైసీపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం అనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన తెలుసుకోవడానికి వచ్చిన తరుణంలో జనసేన నాయకుల అరెస్టులను కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇదే చెప్తున్నాము అరెస్టులతో నాయకులను కార్యకర్తలను ఆపవచ్చేమో కానీ మా పోరాటం మాత్రం ఆగదు ప్రాణాలకు తెగించి జనసేన పార్టీలో అధినేత వెంబడి నడుద్దామని నిర్ణయించుకున్న వాళ్ళం ఇలాంటి ఉడుత బెదిరింపులకు తుపాకీతూటాలకు భయపడితే మేము తిరిగే నాయకుడికి అర్థమేమి ఉంటుంది. రాజధానుల గురించి గర్జించే శాసనసభ్యులను, మంత్రులను, ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాము రాజధాని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యులు మంత్రులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం పనికిమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రాంతీయ గొడవలు రెచ్చగొట్టి జనసేన పార్టీ మీద అంటకడితే చోద్యం చూడాలనుకుంటే సమాధానాలు ఎలా చెప్పాలో జనసేన పార్టీకి కూడా బాగా తెలుసు ఆరోజు రాజధాని గురించి నిర్ణయం తీసుకున్న సభలో నిద్రపోతూ మద్దతు తెలిపిన ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆరోజు ఏమి చేసారు. ఈరోజు గర్జనలు అని వెంటపడుతున్నారు ఆరోజు విశాఖపట్నం కనపడలేదా కర్నూలు కనపడలేదా రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చాలి అన్నట్టుగా ప్రవర్తించే ఈ గుండా రాజకీయాలను కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మా నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసినంతమాత్రాన బెదిరిపోయి వెళ్ళిపోతామని అనుకోవద్దు. ఈ పత్రికా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము అరెస్టు చేసిన మా నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయకపోతే మా అధినేత నిర్ణయం ప్రకారం మేము ఏం చేయాలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అదిచేసి చేరుతాను. దీనిని ఆపడం ఎవరి తరం కాదు చేతులు కట్టుకున్నారు, ఏమంటున్న పడుతున్నారు, చేతకానితనం అనుకుంటే వైసీపీ వాళ్ళ భ్రమ ఇదే మంత్రులు ఆరోజు గనుక అమరావతి రాజధానికి మద్దతు తెలవకుండా ఉంటే ఆ రోజే మూడు రాజధానుల నిర్ణయం చెప్పుంటే ఈరోజు ఇలా జరిగేవి కాదు కదా వైసీపీ నాయకులు లాగా రోజుకో మాట మాట్లాడే పార్టీ కాదు జనసేన పార్టీ కాదు చివరిగా వైసీపీ నాయకులకు తెలియజేసేది ఒకటేమీరు బే షరతుగా అరెస్ట్ అయిన మా నాయకులను కార్యకర్తలను వదిలిపెట్టేయాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మా నాయకులను అరెస్టు చేయడంలో అర్ధరాత్రి హల్చల్ చేసిన పోలీస్ శాఖ వారు కూడా అధికారుల కొమ్ము కాయడం వెనక మీయొక్క ఒంటి మీద ఉన్న కాకి దుస్తులకు విలువ లేకుండా పోతున్న విషయం పోలీస్ శాఖ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విషయం ఏమిటి అంటే మీరు మాటలు మర్యాదగా మాట్లాడితే పక్క వారు కూడా మర్యాదగా సమాధానం చెబుతారు మీకన్నా చిల్లర వేషగాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని మీరు గమనించాలి. చిల్లర చేష్టాలు చేస్తున్న మీలాంటి వాళ్లకి మంత్రి పదవులు అంటగట్టడం ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దౌర్భాగ్యం నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రెస్ మీట్ లు పెట్టి మీకు సాక్షి టీవీ దొరికిందని మా నాయకుడి మీద మాటలు పేలితే ముందు ముందు మీరు జనాలకి సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి పెట్టిన దరిద్రమైన విషయం ఏమిటి అంటే నీచమైన మంత్రులు మీరు ఒకరని మీకు తెలియజేస్తున్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ మీద, జనసేన నాయకులు మీద మాటలు తూటాలు గాని మీరు పేలిస్తే అంతకు అంతా సమాధానం చెప్పగల దమ్ము సత్తా మాకు ఉందని మరోసారి తెలియజేస్తున్నామని కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పులి మల్లికార్జునరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి అంకోజిరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.