కరెంట్ బిల్లుల సమస్యపై ప్రశ్నించిన పెంటేల బాలాజీ

చిలకలూరిపేట పట్టణంలో మరియు పలు గ్రామాలలో విద్యుత్ అధికారులు మేటర్ రీడింగ్ సకాలంలో తీయకపోవటం ప్రజలపై అధిక భారం పడుతుందని బాధితులు జనసేన నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై బాలాజి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాల్సి ఉండగా 31 నుండి 40 రోజులవరకు బిల్లులు తీస్తున్నారని, 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు (ఒక్కొక్క యూనిట్ ధర), 2రోజులు లేటు చేయడం వల్ల 2 రోజులలో 5 యూనిట్లు పెరిగినా 105 యూనిట్లు అవుతుంది. 100 దాటి ఒక్క యూనిట్ పెరిగినా యూనిట్ ధర 6.90 రూపాయలు కట్టాలి, 100 యూనిట్లకు 360 రూపాయలు కట్టాల్సిన ప్రజలు ఒక్క యూనిట్ తేడాతో 690 రూపాయలు కట్టాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ప్రభుత్వం పంచి పెడుతున్న సంక్షేమ పధకాల డబ్బు తిరిగి ప్రజలనుండి అధిక బిల్లులు, అధిక పన్నులు ద్వారా జగన్ ప్రభుత్వం వసూల్ చేస్తున్నారని పెంటేల బాలాజి విమర్శించారు. పెంటేల బాలాజీ విధ్యుత్ శాఖ ఏ డి అశోక్ ఫోన్ చేసి ఈ సమస్య తెలియజేసి త్వరగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా పరిష్కారం చేయాలనీ కోరారు.
ఏ డి అశోక్ మాట్లాడుతూ మరోకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియచేసారు. రిపీటెడ్ గా రీడింగ్ తీయటంలో అవకతవకలు జరిగినట్లయితే ఆ బిల్లులు తీసుకు వస్తే తగిన పరిష్కారం చూస్థామని విధ్యుత్ ఏ డి తెలియచేసారు.