వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారు

అనంతపూర్: ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రభుత్వ వేదికపైన పిల్లల ముందర ప్రతిపక్షాలను విమర్శించడమే తప్పు? అలాంటిది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ చట్ట ప్రకారం విడిపోయిన బార్యల గురించి మాట్లాడుతూ పిల్లలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నావు జగన్ మోహన్ రెడ్డి? అని కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన నాయకులు ప్రశ్నించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడలేదు? పిల్లల ముందర ఇంత నీచ నికృష్టమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు?. మీరు పాదయాత్రలో వచ్చే ఎన్నికలకు నేను మద్యం షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తాను అని చెప్పారు? ఈ ఎన్నికలకు మీరు మద్యం షాపులు తీసేసి వస్తారా? లేదా?. ఇసక మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఈ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తుంది?. జల వనరుల ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు అయినా ఈ నాలుగున్నర సంవత్సరంలో పూర్తి చేశారా?. ప్రత్యేక హోదా ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి ఏమైంది? నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటివి ఇచ్చారా? ఈ నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రానికి ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చాయి? రాష్ట్రానికి ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు? కియా అనుబంధ సంస్థలు పక్క రాష్ట్రాలకు ఎందుకు తరలిపోయాయి? అమర్ రాజ్ బ్యాటరీ వాళ్లు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు?. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేశారా? అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేశావా? కాంటాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేశావా? మెగా డీఎస్సీ ఏమైంది?ఆశా వర్కర్ల పరిస్థితి ఏమి?అంగన్వాడీల పరిస్థితి తేల్చు? మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి ఇబ్బడి ముబ్బడిగా మీరు నోటికొచ్చినట్లు ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పండి? ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు మాత్రం కొన్ని సంక్షేమ పథకాలను భూతద్దంలో చూపిస్తూ? రాష్ట్రంలో మీ క్రిమినల్ గ్యాంగ్ దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతూ దోచుకుంటున్న సంపదంత ఎక్కడికి పోతుందో చెప్పగలరా?. అంతేగాని అనవసరంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు వస్తామంటే.. ప్రజలు వచ్చే 2024 ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతారు అని కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తూ ఉన్నాము.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య జాయింట్ కార్యదర్శి బాల్యం రాజేష్ బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు జనసేన వేద మహిళలు షేక్ తార మమత జనసేన నాయకులు వెంకటేష్ వంశీ కాంతరాజ్ జాకీర్ ముక్కన్న తిప్పేస్వామి శ్రీనివాసులు మహేష్ కార్తీక్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.